- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగళూరు చేరుకున్న RCB జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2025) 18వ సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు నిలిచిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2025) 18వ సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) జట్టు నిలిచిన విషయం తెలిసిందే. నిన్న గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం(Narendra Modi Stadium)లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో పంజాబ్‌పై విజయం సాధించింది. దీంతో దేశ వ్యాప్తంగా ఆర్సీబీ(RCB), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. అయితే.. ఈ విజయాన్ని ఫ్యాన్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహిస్తున్నట్లు ఫ్రాంఛైజీ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జట్టు బెంగళూరు నగరానికి చేరుకుంది. ఎయిర్‌పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. మరోవైపు.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశముండటంతో పరేడ్ నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఓపెన్ బస్ పరేడ్ రద్దయింది. అయితే, సాయంత్రం 5 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంట్రీ పాస్‌లు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు. స్టేడియం వద్ద వాహనాలు పార్కింగ్ చేయడానికి తక్కువ స్థలం ఉండటంతో సన్మాన కార్యక్రమానికి హాజరయ్యే ప్రేక్షకులు మెట్రో, ఇతర ప్రజా రవాణాను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.






