- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐపీఎల్‌లో సంచలనం.. ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ ఘన విజయం

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో ఇవాళ ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ మ్యాచ్‌లో కోల్‌కతా(Knight Riders)పై పంజాబ్(Punjab Kings) జట్టు ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఓపెనర్లు తప్ప ఎవరూ రాణించలేదు. మొత్తంగా 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలారు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్(30), ప్రియాన్ష్ ఆర్య(22), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(0), జోష్ ఇంగ్లీష్(02), నేహాల్ వధేరా(10), గ్లెన్ మ్యాక్స్‌వెల్(07), సూర్యాన్ష్ షెగ్డే(04), జాన్సన్(01) ఇలా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. కోల్‌కతా బౌటర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో రెండేసి వికెట్లు తీయగా, అన్రిచ్ నార్జే, వైభవ్ అరోరా చెరో వికెట్ తీశారు.
ఇక పంజాబ్ నిర్దేశించిన 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన కోల్‌కతా బ్యాటర్లు కూడా ఘోరంగా విఫలం అయ్యారు. ఒకరి వెనకాల ఒకరు వరుసగా పెవీలియన్‌కు క్యూ కట్టారు. డికాక్(2), సునీల్ నరైన్(5), రహానే(17), రఘువంశీ(37), వెంకటేశ్ అయ్యర్(7), రింకూ సింగ్(2), అండ్రె రస్సెల్(17), రమన్ దీప్(0), హర్షి్త్ రాణా(3), వైభవ్ అరోరా(0) ఇలా అందరూ విఫలం కావడంతో కోల్‌కతాకు ఓటమి తప్పలేదు. మొత్తంగా 15.1 ఓవర్లలో 95 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు, జాన్సన్ మూడు వికెట్లు, మాక్స్‌వెల్, అర్షదీప్ సింగ్, బార్లెట్ తలో వికెట్ తీశారు.