వారిపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సీరియస్.. బీసీసీఐ లేఖ

by Harish |

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ చీఫ్ క్యూరేటర్‌ సుజన్ ముఖర్జీపై కామెంటేటర్లు హర్షా భోగ్లే, సైమన్ డౌల్ చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) సీరియస్ అయ్యింది.

వారిపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సీరియస్.. బీసీసీఐ లేఖ
X

దిశ, స్పోర్ట్స్ : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ చీఫ్ క్యూరేటర్‌ సుజన్ ముఖర్జీపై కామెంటేటర్లు హర్షా భోగ్లే, సైమన్ డౌల్ చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) సీరియస్ అయ్యింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లకు వారిద్దరిని అనుమతించొద్దని బీసీసీఐకి లేఖ రాసింది. ఇటీవల కోల్‌కతా, పంజాబ్ మధ్య మ్యాచ్ అనంతరం పిచ్‌పై కామెంటేటర్లు హర్షా భోగ్లే, సైమన్ డౌల్ అసహనం వ్యక్తం చేశారు. ఫ్రాంచైజీ డిమాండ్ల ప్రకారం పిచ్‌లు సిద్ధం చేయాలని, అందుకు క్యూరేటర్ సహకరించకోతే కేకేఆర్ ఫ్రాంచైజీ కొత్త హోం గ్రౌండ్‌ను చూసుకోవడం మంచిదని డౌల్ వ్యాఖ్యానించాడు. హర్షా భోగ్లే సైతం సొంత జట్టుకు ఉపయోగపడేలా పిచ్‌లు సిద్ధం చేయాలన్నాడు. ఈ వాఖ్యలపై క్యాబ్ తీవ్రంగా స్పందించింది. క్యూరేటర్ ఏ తప్పు చేయలేదని, బీసీసీఐ రూల్ బుక్ ప్రకారమే అతను పిచ్‌లు సిద్ధం చేశారని తెలిపింది. ఐపీఎల్‌లోని ఏ ఫ్రాంచైజీ పిచ్ స్వభావాన్ని చెప్పలేదని పేర్కొంది. క్యాబ్ లేఖపై ఇంకా బీసీసీఐ స్పందించలేదు. అయితే, సోమవారం కోల్‌కతా, గుజరాత్ మధ్య జరిగే మ్యాచ్‌కు హర్షా, డౌల్ కామెంటరీ చేయడం లేదని సమాచారం.


Next Story