- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL: ఉత్కంఠ పోరులో లక్నో ఘన విజయం
జైపూర్(Jaipur) వేదికగా రాజస్థాన్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో(Lucknow Super Giants) విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: జైపూర్(Jaipur) వేదికగా రాజస్థాన్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో(Lucknow Super Giants) విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో గెలుపొందారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్ చేసింది. ఒకరిద్దరు మినహా అందరూ విఫలం అయ్యారు. ఐడెన్ మార్కరమ్ (66), ఆయుష్ బదోని (50) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. చివరల్లో డెవిడ్ మిల్లర్(30) మెరుపులు మెరిపించారు. మొత్తంగా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయిన లక్నో 180 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో హసరంగ మూడు వికెట్లు తీయగా, ఆర్చర్, సందీప్ శర్మ, దేశ్‌పాండే తలో వికెట్ తీశారు.
ఇక 181 పరుగుల లక్ష్యాన్ని ఛేధించేందుకు వచ్చిన రాజస్థాన్ బ్యాటర్లు సైతం అద్భుతంగా రాణించారు. జైస్వాల్ (74), సూర్యవంశీ (34), రియాన్ పరాగ్ (39) రాణించినా ఓటమి తప్పలేదు. ఓవరాల్‌గా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితం అయ్యారు. లక్నో బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, మార్కరమ్ తలో వికెట్ తీయగా, ఆవేన్ ఖాన్ రెండు వికెట్లు తీశారు.






