- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL: చితక్కొట్టిన బట్లర్.. ఢిల్లీపై గుజరాత్ విజయం
అహ్మదాబాద్ మైదానం(Narendra Modi Stadium) వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు విజయం సాధించింది.

దిశ, వెబ్డెస్క్: అహ్మదాబాద్ మైదానం(Narendra Modi Stadium) వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ తమ ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేశారు.
అయితే ముందుగా టాస్ ఓడి ఢిల్లీ బ్యాటింగ్ చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో ఒకరిద్దరు మినహా అందరూ చక్కగా రాణించారు. కరుణ్ నాయర్ (31), అక్షర్ పటేల్ (39), అశుతోష్ శర్మ (37), స్టబ్స్ (31), కేఎల్ రాహుల్ (28), అభిషేక్ పోరెల్ (18) పరుగులతో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. మొత్తంగా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీయగా, సిరాజ్, అర్షద్ ఖాన్, ఇషాంత్, సాయి కిషోర్ తలో వికెట్ తీశారు.
ఇక 203 పరుగులు లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన గుజరాత్ బ్యాటర్లు కూడా అద్భుతంగా రాణించారు. ఓపెనర్ సాయి సుదర్శన్ (36), జాస్ బట్లర్ (97), రూథర్ ఫర్డ్ (43) పరుగులతో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ముకేశ్ కమార్ చెరో వికెట్ తీయగా, శుభ్మన్ గిల్ను కరుణ్ నాయర్ రన్ ఔట్ చేశారు.






