IPL: లక్నోపై ఢిల్లీ ఘన విజయం

by Gantepaka Srikanth |

లక్నో సూపర్ జెయింట్స్‌(Lucknow Super Giants)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) ఘన విజయం సాధించింది.

IPL: లక్నోపై ఢిల్లీ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: లక్నో సూపర్ జెయింట్స్‌(Lucknow Super Giants)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలోనే చేధించి ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. అభిషేక్ పోరెల్ (51), కరుణ్ నాయర్ (15), కేఎల్ రాహుల్ (57), అక్షర్ పటేల్ (34) పరుగులు చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించారు. లక్నో బౌలర్లలో మార్కరమ్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా, మిగిలిన బౌలర్లంతా విఫలం అయ్యారు.

మరోవైపు టాస్ ఓడిన లక్నో జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు అద్భుతంగా స్టార్ట్ చేసినా.. తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా విఫలం అయ్యారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఐడెన్ మార్కరమ్ (52), మిచెల్ మార్ష్ (45), నికోలస్ పూరన్ (09), అబ్దుల్ సమద్ (02), డెవిడ్ మిల్లర్ (14), ఆయుష్ బదోని (36) పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా, చమీర, స్టార్క్ తలో వికెట్ తీశారు.

Next Story