- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధోనీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేని వార్త.. ఇదే చివరి మ్యాచ్ బ్రో!
క్రికెట్ అభిమానులకు టీమిండియా(Team India) మాజీ దిగ్గజం ఎమ్ఎస్ ధోనీ(MS Dhoni) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులకు టీమిండియా(Team India) మాజీ దిగ్గజం ఎమ్ఎస్ ధోనీ(MS Dhoni) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భారత జట్టుకు ఆయన అందించిన విజయాలు, ట్రోఫీలే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా ధోనీ ఫ్యాన్స్ తట్టుకోలేని, అస్సలు ఒప్పుకోలేని వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి స్థాయిలో క్రికెట్‌కు గుడ్ బై చెప్పడానికి ధోనీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టులు, టీ20లు, వన్డేలకు విడ్కోలు పలికిన ఆయన.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. అయితే ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న ధోనీ ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పబోతున్నారు. ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గుజరాత్ vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ విడ్కోలు ప్రకటన చేస్తారని అంతా భావిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా వార్తలు వైరల్‌గా మారాయి.
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 278 మ్యాచులు ఆడిన ధోనీ.. 5439 పరుగులు చేశారు. 24 హాఫ్ సెంచరీలు చేశారు. ఐపీఎల్ కెరియర్‌లో ఇప్పటివరకు 264 సిక్సులు బాదగా, 375 ఫోర్లు కొట్టారు. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టుకు ఏకంగా 5 ట్రోఫీలు అందించారు. అయితే.. ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న వార్తలను ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ‘చాలా మిస్ అవుతాం తలా’ అని పోస్టులు పెడుతున్నారు.






