Breaking: డూ ఆర్ డై మ్యాచ్‌లో టాస్ ఓడిన RCB

by Satheesh |
Breaking: డూ ఆర్ డై మ్యాచ్‌లో టాస్ ఓడిన RCB
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ మరీ కాసేపట్లో తలపడబోతున్నాయి. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో తలపడేందుకు ఆర్సీబీ, రాజస్థాన్ జట్లు రెడీ అయ్యాయి. బుధవారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచింది. కెప్టెన్ సంజు శాంసన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.

కీలకమైన డూ ఆర్ డై మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి ప్రయోగాలు చేయకుండా సేమ్ టీమ్స్‌తో బరిలోకి దిగుతున్నాయి. కాగా, సీజన్ మొదట్లో వరుస విజయాలతో దుమ్మురేపిన ఆర్ఆర్.. సెకండాఫ్‌లో వరుస పరాజయాలతో ఢీలా పడింది. ఇక, సీజన్ మొదటి దశలో వరుస పరాజయాలతో లీగ్ నుండే నిష్క్రమిస్తుందనుకున్న ఆర్సీబీ.. అనుహ్య విజయాలతో ఊహించని విధంగా ప్లే ఆఫ్స్‌లోకి దూసుకొచ్చింది. టైటిల్ రేసులో ముందుకు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి మరీ.

జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (w), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, సంజు శాంసన్ (w/c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

Next Story