IPL 2023: టాస్ గెలిచిన గుజరాత్..

by Disha Web Desk 13 |
IPL 2023: టాస్ గెలిచిన గుజరాత్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, స్వల్ప అస్వస్థతతో ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం కావడంతో.. అతడి స్థానంలో గుజరాత్ టైటాన్స్‌కు రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హార్దిక్ స్థానంలో విజయ్ శంకర్ తుదిజట్టులోకి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి మాంచి ఊపు మీద ఉండగా.. కోల్ కతా రెండు మ్యాచ్‌లు ఆడి, ఒకదాంట్లో విజయం సాధించింది. ఇరుజట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండడంతో పోరు రసవత్తరంగా ఉండనుంది.

గుజరాత్ (ప్లేయింగ్ XI):

శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (WK), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ (c) అల్జారీ జోసెఫ్, జోష్ లిటిల్, యష్ దయాల్, మహమ్మద్ షమీ

కోల్‌కతా (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్ (wk), నితీష్ రాణా (c), N జగదీసన్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి



Next Story