- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో SRH ప్లేయర్ల పూజలు
జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో SRH ప్లేయర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ లో అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH) ప్లేయర్లు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో సందడి చేశారు. శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ ( Jubilee Hills) పెద్దమ్మ తల్లిని ( Peddamma Temple) దర్శించుకున్నారు హైదరాబాద్ ఆటగాళ్లు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, సిక్సుల వీరుడు అభిషేక్ శర్మ ఇద్దరూ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు క్రికెటర్లకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు కూడా చేశారు. దర్శనం పూర్తయిన తర్వాత హైదరాబాద్ ప్లేయర్లను పీజేఆర్ కుమారుడు విష్ణు శాలువాతో సన్మానించారు.
అమ్మవారి ఫోటోలను కూడా అందించారు. ఇది ఇలా ఉండగా, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో మధ్య ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు బిగ్ ఫైట్ ఉండనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది. ఇప్పటికే కేకేఆర్ పై విజయం సాధించిన హైదరాబాద్, లక్నో పైన కూడా విక్టరీ సాధించాలన్న కసితో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తూ కష్టపడుతున్నారు. ఇక అటు తొలి మ్యాచ్ లో ఓడిపోయిన లక్నో.. ఎలాగైనా హైదరాబాద్ పై విజయం సాధించాలన్న ఆతృతతో కనిపిస్తోంది.






