- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రేయస్ ను భారత కెప్టెన్ చేయండి..బాలీవుడ్ బ్యూటీ
అయ్యర్ ఎంతో గొప్ప ప్లేయర్ అని కొనియాడిన ప్రీతి జింటా.. భారత జట్టు టీ20 కెప్టెన్ గా ఎదుగుతాడని పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పై ప్రీతి జింటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయ్యర్ ఎంతో గొప్ప ప్లేయర్ అని కొనియాడిన ప్రీతి జింటా.. భారత జట్టు టీ20 కెప్టెన్ గా ఎదుగుతాడని పేర్కొన్నారు. టీ20 కెప్టెన్ గా అయ్యే అర్హత కేవలం శ్రేయస్ అయ్యర్ కు మాత్రమే ఉందన్నారు. పంజాబ్ కింగ్స్ జట్టును ఒంటి చేత్తో ముందుకు తీసుకు వెళ్తున్నాడని ప్రకటించారు. ఈ సారి పంజాబ్ కింగ్స్ ను విజేతగా నిలుపుతాడని తనకు నమ్మకం ఉందన్నారు.
ఇలాంటి ప్లేయర్ ను బీసీసీఐ కూడా గుర్తించాలని కోరారు. కాగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న శ్రేయస్ అయ్యర్... జట్టును ఛాంపియన్ చేసేందుకు చాలా కష్టపడుతున్నాడు. 2025 ఐపీఎల్ సందర్భంగా ఫైనల్ దాకా తీసుకువెళ్లిన అయ్యర్, ఇప్పుడు పాయింట్ల పట్టికలో పంజాబ్ ను నెంబర్ వన్ స్థానంలో పెట్టాడు. ఈ సీజన్ లో కెప్టెన్ గానే కాకుండా, బ్యాటర్ గా దుమ్ములేపుతున్నాడు. దీంతో భారత టీ20 కెప్టెన్ గా సూర్య స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను చేయాలని మాజీలు కోరుతున్నారు.






