- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KKRకు బిగ్ రిలీఫ్..రంగంలోకి దిగిన రూ.18 కోట్ల ప్లేయర్
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి రూ.18 కోట్ల మతీషా పతిరానా చేరారు.

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తూ పాయింట్ల పట్టికలో చిట్ట చివరన నిలిచింది కేకేఆర్. ఎంత మంది ప్లేయర్లను మార్చినా, కేకేఆర్ మాత్రం ఒక్క విజయాన్ని నమోదు చేయడం లేదు. అయితే ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్న కేకేఆర్ జట్టుకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చేసాడు. రూ.18 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన స్టార్ బౌలర్ మతీషా పతిరనా, కేకేఆర్ జట్టులో చేరాడు.
కేకేఆర్ లో చేరిన మతీషా పతిరనా
శ్రీలంక క్రికెట్ బోర్డు తాజాగా ఎన్ఓసీ ఇచ్చింది. దీంతో ఇండియా ఫ్లైట్ ఎక్కిన మతీషా పతిరనా, కేకేఆర్ జట్టులో చేరిపోయాడు. ఈ మేరకు కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటన చేసింది. లసిత్ మలింగ తరహాలో డెత్ ఓవర్లలలో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే సత్తా ఉన్న ఆటగాడు మతీషా పతిరనా. ఇక ఇతని రాకతో కేకేఆర్ బౌలింగ్ విభాగం మరింత బలపడుతుందని.. తద్వారా విజయాలు నమోదు కావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగే మ్యాచ్ లో మతీషా పతిరనా ఆడతాడా ? లేక రిజర్డ్ బెంచ్ కు పరిమితం అవుతాడా ? అనేది చూడాల్సి ఉంది. కాగా ఈ సీజన్ లో కేకేఆర్ ఇప్పటి వరకు ఐదు ఆరు మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఐదు ఓడిపోగా ఒకటి వర్షం కారణంగా రద్దయింది.






