ప్లే ఆఫ్స్ రేస్..నాలుగో స్థానం కోసం గ‌ట్టి పోటీ, ఎవ‌రికీ ఛాన్స్ అంటే ?

by velandi.Saikiran |   (  Updated:2026-05-19 11:21:26  IST  )

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసులో నాలుగో స్థానం కోసం గ‌ట్టి పోటీ నెల‌కొంది.

ప్లే ఆఫ్స్ రేస్..నాలుగో స్థానం కోసం గ‌ట్టి పోటీ, ఎవ‌రికీ ఛాన్స్ అంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లో భాగంగా నాలుగో స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, గుజరాత్ జట్లు క్వాలిఫై అయ్యాయి. ఇక నాలుగో స్థానం కోసం ఏకంగా ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై జట్లకు ఎక్కువగా అవకాశాలు ఉంటే.. మిగిలిన జట్లు అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్స్ చేరుకోలేవు. పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచ్ లో గెలిస్తే, కచ్చితంగా ప్లే ఆఫ్స్ లోకి చేరుకుంటుంది. ఒకవేళ...పంజాబ్ త‌న చివ‌రి మ్యాచ్ ఓడిపోతే.. రాజస్థాన్, చెన్నై, ఢిల్లీ తమ తర్వాతి మ్యాచ్ లలో ఓడిపోవాలి.

అప్పుడు పంజాబ్ కు ఛాన్స్ ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో రెండింటిలో గెలిస్తే, కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. ఒకటి ఓడినా.. పంజాబ్ కింగ్స్ తన చివరి మ్యాచ్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తమ మిగిలిన లీగ్ మ్యాచ్ లలో ఓడిపోతేనే చెన్నైకి అవకాశం లభించనుంది. అద్భుతం జరిగితే తప్ప..కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశాలు లేవు. మరి ఏ టీమ్ ప్లే ఆఫ్స్ ఛాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Next Story