- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్ శర్మకు ఘోర అవమానం..కేవలం గంటసేపే ఆరెంజ్ క్యాప్
సమీర్ రిజ్వి, వెంటనే ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. దీంతో రోహిత్ శర్మకు అవమానం జరిగినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: రోహిత్ శర్మకు ఘోర అవమానం ఎదురయింది. ఆరెంజ్ క్యాప్ అందుకున్న రోహిత్ శర్మకు కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఊహించని షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ పై అద్భుతంగా రాణించిన సమీర్ రిజ్వి, వెంటనే ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. దీంతో రోహిత్ శర్మకు అవమానం జరిగినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఎక్కువ పరుగులు సాధించిన ప్లేయర్ కు ఆరెంజ్ క్యాప్ దక్కుతుందన్న సంగతి తెలిసిందే. అటు ఎక్కువ వికెట్లు తీస్తే పర్పుల్ క్యాప్ అందిస్తారు.
రోహిత్ కు షాక్..ఆరెంజ్ క్యాప్ అందుకున్న సమీర్ రిజ్వి
ఇవాళ ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రోహిత్ శర్మ 35 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో టోర్నమెంట్ లో టాప్ స్కోరర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్ లో అద్భుతంగా చేసింగ్ చేసిన సమీర్ రిజ్వి 90 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మకు సాగిస్తూ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. కాగా ప్రస్తుతం సమీర్ రిజ్వి రెండు మ్యాచ్ లలో 160 పరుగులు సాధించాడు. దీంతో మొదటి స్థానంలో సమీర్ రిజ్వి నిలిచాడు. అంటే రోహిత్ శర్మ 113 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో కాన్లీ 108 పరుగులతో మూడో స్థానంలో ఉండగా రఘువంశీ నాలుగు, కిషన్ కిషన్ 5వ స్థానంలో నిలిచారు.






