ఎట్టకేలకు రాణించిన రూ. 25 కోట్ల ప్లేయర్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే

by velandi.Saikiran |   (  Updated:2026-04-17 16:20:37  IST  )

గుజ‌రాత్ తో జ‌రిగిన మ్యాచ్ లో గ్రీన్ రాణించాడు. ఈ మ్యాచ్ లో 79 ప‌రుగులు చేశాడు.

ఎట్టకేలకు రాణించిన రూ. 25 కోట్ల ప్లేయర్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే
X

దిశ‌, వెబ్ డెస్క్: కేకేఆర్ వర్సెస్ గుజరాత్ మధ్య అహ్మదాబాద్ వేదికగా ఇవాళ కీలక పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ అజింక్య రహానే, మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ విఫలమైనప్పటికీ, రూ.25 కోట్ల ప్లేయర్ గ్రీన్ మాత్రం రాణించాడు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో చెత్త ప్రదర్శన కనబరిచిన గ్రీన్, గుజరాత్ పైన అదరగొట్టాడు. 55 బంతుల్లో 79 పరుగులతో రఫ్ ఆడించాడు. ఇందులో 7 బౌండ‌రీలు, 4 సిక్స‌ర్లు ఉన్నాయి. దీంతో కేకేఆర్ 180 పరుగులు సాధించగలిగింది.

ఆకట్టుకున్న గుజరాత్ బౌలర్లు

నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా గుజరాత్ బౌలర్లు ఆకట్టుకున్నారు. కగిసో రబాడా మూడు వికెట్లు పడగొట్టగా.. మహమ్మద్ సిరాజ్, అశోక్ శర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ కృష్ణ, రషీద్ ఖాన్ కు తలో వికెట్ పడింది.

Next Story