- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CSK Vs RR: కుప్పకూలిన సీఎస్కే టాపార్డర్.. ఏకంగా 6 వికెట్లు డౌన్
IPL 2026 సీజన్ 3వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్ కుప్పకూలింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు అదరగొట్టారు. స్థానిక బర్సాపరా స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరుగుతున్న ఈ పోరులో రాజస్థాన్ తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆట మొదలైనప్పటి నుంచి రాయల్స్ బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్‌లు తగిలాయి. రాజస్థాన్ పేసర్ నాండ్రే బర్గర్ తన పదునైన బౌలింగ్‌తో చెన్నై బ్యాటర్లను బెంబేలెత్తించాడు. కేవలం 8 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 6 వికెట్లు కోల్పోయి 70 పరుగులు మాత్రమే చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (6) పరుగుల చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అదేవిధంగా సంజూ శాంసన్ (6) బర్గర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక ఆయుష్ మాత్రే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. అదేవధంగా పవర్ హిట్టర్ శివమ్ దూబే (6) ఒక సిక్సర్ బాదినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.
ప్రస్తుతం క్రీజులో కార్తీక్ శర్మ (15), జేమి ఓవర్టన్ (1) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో నాండ్రే బర్గర్ 3 వికెట్లు తీసి చెన్నై వెన్ను విరిచాడు. రవీంద్ర జడేజా రెండు వికెట్లు, ఆర్చర్, సందీప్ శర్మ చెరో వికెట్ పడగొట్టారు.






