- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నై సూపర్ విక్టరీ..ఐపీఎల్ నుంచి ముంబై ఔట్ ?
ముంబై ఇండియన్స్ పై చెపాక్ లో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ విక్టరీ సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ మరో ఓటమిని చవిచూసింది. దీంతో ఈ టోర్నమెంటులో ముంబై, దాదాపు ఇంటిదారి పట్టినట్లేనని అంటున్నారు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్, ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. ఇక మిగిలిన 8 మ్యాచ్ లలో భారీ తేడాతో గెలిచి గుజరాత్ టైటాన్స్, లేదా రాజస్థాన్ రాయల్స్ లను దాటేస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశం ముంబై ఇండియన్స్ కు ఉంటుంది.
ముంబైని చిత్తు చేసిన చెన్నై
చెన్నై వేదికగా జరిగిన CSK, ముంబై మ్యాచ్ చాలా చప్పగానే సాగింది. ఎలాంటి మెరుగుపులు లేకుండానే ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని కేవలం 18.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఛేదించింది చెన్నై సూపర్ కింగ్స్. దీంతో ముంబైపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది చెన్నై. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చెన్నై సూపర్ కింగ్స్ చేరుకుంది. అటు ముంబై ఇండియన్స్ తొమ్మిదవ స్థానంలోనే కొనసాగుతోంది.






