- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటమి బాధలో ఉన్న ముంబై ప్లేయర్లకు అంబానీ బంపర్ ఆఫర్
ముంబై ఇండియన్స్ జట్టుకు 5 రోజుల విరామం దొరకడంతో ఆటగాళ్లు కాస్త బ్రేక్ తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఓటమి బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు కాస్త రిలాక్స్ అయ్యేలా అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్యామిలీతో ఐదు రోజుల పాటు ట్రిప్ వెళ్లేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ‘వనతార’ లో ప్లేయర్లు ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లు చేయించారట. ఏప్రిల్ 23వ తేదీన అంటే నిన్న చెన్నైతో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగింది. ఇందులో 103 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ చిత్తగా ఓడిపోయింది.
దీంతో ఫాన్స్ అందరు నిరాశలో ఉన్నారు. ఇక ముంబై తన నెక్స్ట్ మ్యాచ్ ఏప్రిల్ 29వ తేదీన ఆడనుంది. అంటే ఈ మ్యాచ్ కు మరో ఐదు రోజుల సమయం ఉందన్నమాట. ఐదు రోజుల విరామం ఉన్న నేపథ్యంలో రిఫ్రిష్ అయ్యేందుకు ముంబై ఇండియన్స్ బౌలర్లు బుమ్రా, బౌల్ట్ ఇతర క్రికెటర్లు తమ ఫ్యామిలీస్ తో కలిసి జామ్ నగర్ లోని వనతారకు బయలుదేరారు. వనతారలోనే ఐదు రోజుల పాటు ఎంజాయ్ చేయనున్నారు. ఈ సందర్భంగా భార్య పిల్లలతో కలిసి వీళ్లు ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అనంతరం వనతారకు వెళ్తారు.






