ఐఓసీఎల్ లాభాలు రూ. 8,781 కోట్లు!

by  |
ఐఓసీఎల్ లాభాలు రూ. 8,781 కోట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి త్రైమాసికంలో రూ. 8,781.30 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ. 5,185.32 కోట్ల నికర నష్టాలను వెల్లడించింది. దేశీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో ఐఓసీఎల్ మెరుగైన లాభాలను సాధించినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. కార్యకలాపాల ద్వారా సంస్థ ఆదాయం రూ. 1.63 లక్షల కోట్లకు చేరుకుందని, గతేడాది ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ. 1.39 లక్షల కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ 21.2 మిలియన్ (2.12 కోట్ల టన్నుల) టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను విక్రయించినట్టు సంస్థలు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో 20.69 మిలియన్(2.06 కోట్ల) టన్నుల విక్రయాలు నమోదు చేసింది. బుధవారం ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఐఓసీఎల్ షేర్ ధర 1.37 శాతం పెరిగి రూ. 107 వద్ద ట్రేడయింది.


Next Story