- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైర్ యాక్సిడెంట్..
by Batti.Sumithra |
<p>దిశ,హైదరాబాద్ : హైదరాబాద్‌లోని హై గ్లాస్ అండ్ కెమికల్ గ్యాస్ గోదాంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధి గంజ్ మార్కెట్లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న మలక్‌పేట్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్‌ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.అయితే గోదాంలో ఇంకా గ్యాస్ సిలెండర్‌లు ఉండవచ్చునని అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రమాద తీవ్రత పెద్ద మొత్తంలో ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకుంటున్నరాని […]</p>
X
దిశ,హైదరాబాద్ :
హైదరాబాద్‌లోని హై గ్లాస్ అండ్ కెమికల్ గ్యాస్ గోదాంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ఘటన చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధి గంజ్ మార్కెట్లో చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న మలక్‌పేట్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్‌ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.అయితే గోదాంలో ఇంకా గ్యాస్ సిలెండర్‌లు ఉండవచ్చునని అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రమాద తీవ్రత పెద్ద మొత్తంలో ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకుంటున్నరాని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం వలన భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది.కాగా, ప్రమాదానికి గల కారణాల గూర్చి ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






