Sonu sood: సోనూ సూద్‌పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం అన్నారో తెలుసా.?

by  |
Sonu sood: సోనూ సూద్‌పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం అన్నారో తెలుసా.?
X

దిశ, సినిమా : మంత్రి కేటీఆర్ (KTR ), సోనూ సూద్ ( Sonu sood) మధ్య మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ చోటు చేసుకుంది. కరోనాతో బాధపడుతున్న ఓ వ్యక్తికి 10 గంటల్లోనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పంపించారు కేటీఆర్. దీంతో ఆ వ్యక్తి కేటీఆర్‌ను సూపర్ హీరోగా అభివర్ణించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ప్రజలు ఎన్నుకున్న నాయకుడిగా తన వంతు సహాయం చేస్తున్నానని, తనను కాకుండా సోనూ సూద్‌ను ‘సూపర్ హీరో’ అని పిలిస్తే బాగుంటుందని సూచించాడు. ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన సోనూ సూద్.. ‘మీ మాటలకు ధన్యవాదాలు సార్! కానీ మీరు నిజంగా హీరో. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో చేశారు. మీ నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. నేను తెలంగాణను నా రెండో ఇంటిగా, నా పని ప్రదేశంగా భావిస్తున్నాను. అక్కడి ప్రజలు తనపై గొప్ప ప్రేమను చూపిస్తున్నారు’ అని తెలిపాడు.

https://twitter.com/SonuSood/status/1399586687974400000?s=20


Next Story

Most Viewed