ఖానాపూర్‌లో కరెంట్ లేదు.. BSNL‌ సిగ్నల్ రాదు..!

298

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో BSNL సేవలకు.. కరెంట్ కట్ కారణంగా గతేడాదిగా తరచూ అంతరాయం ఏర్పడుతోంది. పట్టణంలోని ప్రధాన రోడ్డుపై చెట్లు తొలగించడం కోసం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గత మూడు రోజుల నుండి బీఎస్‌ఎన్‌ఎల్ సిగ్నల్ బంద్ అయింది. ఈ ప్రభావంతో ప్రభుత్వ కార్యాలయాలైన పోస్ట్ ఆఫీస్, మండల కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, మీసేవా లాంటివి సైతం మూతబడటం గమనార్హం. అంతేకాకుండా BSNL వినియోగదారుల ఫోన్లకు సిగ్నల్ అందడం లేదని మండిపడుతున్నారు. గత సంవత్సరం నుండి ఆఫీసులో జనరేటర్ సౌకర్యం లేక ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ఇకమీదటనైనా అధికారులు నిర్లక్ష్యం వీడాలని, సేవలను వెంటనే పునరుద్దరించాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..