‘కేజీఎఫ్ 2’ టీజర్‌కు ఇంటర్నేషనల్ స్టార్ కాంప్లిమెంట్స్..

by  |
‘కేజీఎఫ్ 2’ టీజర్‌కు ఇంటర్నేషనల్ స్టార్ కాంప్లిమెంట్స్..
X

దిశ, సినిమా : డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కోసం ఇండియా మాత్రమే కాదు విదేశాల్లో ఉన్న రాకీ బాయ్ ఫ్యాన్స్ సైతం ఈగర్‌‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో యశ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ‘పవర్‌ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్‌ఫుల్’ అంటూ వచ్చిన టీజర్.. రిలీజ్ చేసిన కొద్దిగంటల్లోనే రికార్డుల సునామీ సృష్టిస్తూ ట్రెండింగ్‌లోకి వచ్చింది. డైరెక్టర్ టేకింగ్, రాకీ భాయ్ లుక్, పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ సీన్స్‌తో కూడిన కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్‌పై ప్రశంసల వర్షం కురుస్తుండగా.. యూట్యూబ్‌లో169 మిలియన్ ప్లస్ వ్యూ్స్‌తో దూసుకుపోతోంది.

ముఖ్యంగా యశ్ మెషిన్‌ గన్‌తో సిగరెట్ వెలిగించే సీన్‌, అతడి ఇంటెన్స్ లుక్స్‌కు వరల్డ్‌వైడ్ మూవీ లవర్స్ ఫిదా అయ్యారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ స్టార్, యూఎస్ రెజ్లర్ విల్లీ మ్యాక్ కూడా యశ్‌కు భారీ కాంప్లిమెంట్స్ ఇవ్వడం విశేషం. ఈ మేరకు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో టీజర్‌ వీడియో గ్లింప్స్‌ షేర్ చేసిన విల్లీ.. కేజీఎఫ్ సినిమా సూపర్బ్ అని, చాప్టర్ 2 కోసం వెయిట్ చేయలేకపోతున్నానని ట్వీట్ చేశాడు. కాగా ఈ చిత్రం జులై 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.


Next Story

Most Viewed