విసిగించే స్నేహితులకు చెక్!

by Sujitha Rachapalli |

<p>        ఫొటో షేరింగ్ సోషల్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ రోజుకో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవల బూమరాంగ్ ఆప్షన్లో తీసుకొచ్చిన ఫిల్టర్లు బాగా ప్రజాదరణ పొందుతున్నాయి. అలాగే ఇక నుంచి మీ ఖాతాలో మిమ్మల్ని బాగా విసిగించే స్నేహితులు ఎవరనే విషయాన్ని కూడా చెప్పబోతోంది. ప్రస్తుతం ప్రపంచమంతా అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఖాతాదారునితో ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన స్నేహితులు, తక్కువగా ఆసక్తి చూపించిన స్నేహితుల జాబితాను తెలుసుకోవచ్చు.     [&hellip;]</p>

విసిగించే స్నేహితులకు చెక్!
X

ఫొటో షేరింగ్ సోషల్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ రోజుకో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవల బూమరాంగ్ ఆప్షన్లో తీసుకొచ్చిన ఫిల్టర్లు బాగా ప్రజాదరణ పొందుతున్నాయి. అలాగే ఇక నుంచి మీ ఖాతాలో మిమ్మల్ని బాగా విసిగించే స్నేహితులు ఎవరనే విషయాన్ని కూడా చెప్పబోతోంది. ప్రస్తుతం ప్రపంచమంతా అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఖాతాదారునితో ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన స్నేహితులు, తక్కువగా ఆసక్తి చూపించిన స్నేహితుల జాబితాను తెలుసుకోవచ్చు.

అలాగే ఫీడ్‌లో ఎక్కువగా కనిపించిన స్నేహితుల జాబితాను కూడా చూపిస్తుంది. దీని ద్వారా తమ పోస్టులతో ఎక్కువగా విసిగించే స్నేహితులకు చెక్ పెట్టే అవకాశం కలుగుతుంది. ఒకవేళ ఈ ఆప్షన్ కనిపించకపోతే యాప్‌ని అప్‌డేట్ చేసి చూడండి.

Next Story