ఇన్ఫోసిస్‌లో తగ్గుతున్న టాప్ లెవల్ ఉద్యోగులు!

by  |
ఇన్ఫోసిస్‌లో తగ్గుతున్న టాప్ లెవల్ ఉద్యోగులు!
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యయ నియంత్రణలో భాగంగా తక్కువ ఖర్చులతో ఎక్కువ మందిని నియమించాలనే వ్యూహాన్ని ఇన్ఫోసిస్ అనుసరిస్తోంది. కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు ఖర్చులు తగ్గిస్తూ ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరంలోను సీనియర్లు తగ్గనున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో మధ్య స్థాయి, అసోసియేట్ ఉద్యోగుల సంఖ్య పెరిగినప్పటికీ టాప్ లెవల్, సీనియర్ లెవల్ ఉద్యోగులు తగ్గారని కంపెనీ తెలిపింది. ఇటీవల నివేదిక ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫోసిస్‌లో ఉన్నతస్థాయి ఉద్యోగులు 5 శాతం తగ్గి 926 ఉన్నట్టు తెలిపింది. అలాగే, సీనియర్ లెవల్ ఉద్యోగులు 30,013కు తగ్గారు. మధ్యస్థాయి ఉద్యోగులు 4 శాతం మేర పెరిగి 1,15,277గా ఉన్నారు. అసోసియేట్ లెవల్ ఉద్యోగులు 9 శాతం పెరిగి 94,584కు చేరారు. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవాలనే ప్రక్రియలో భాగంగానే కొత్త నియామకాలు, మిడిల్, సీనియర్ ఉద్యోగుల విషయంలో మార్పులను చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్‌లో టాప్ లెవల్ ఉద్యోగులు 7శాతం, సీనియర్ లెవల్ 11 శాతం, మిడిల్ లెవల్ ఉద్యోగులు 25 శాతం పెరిగారు. అయితే, అసోసియేట్ లెవల్ ఉద్యోగులు మాత్రం 2 శాతం తగ్గారు.

Next Story