- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
<p>దిశ, ముధోల్: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అన్నీ రంగాలలో అభివృద్ధి సాధించుకుంటున్నామని దేవాదాయ,అటవీ పర్యాటక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బైంసా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ….పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలో ఆధునిక హంగులతో కోటి యాబై లక్షలతో ఒక ఎకరంలో వైకుంఠదామ నిర్మాణం, పలు కూడళ్లలో స్టాచ్యు నిర్మాణాలు నిర్మించడం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి […]</p>

దిశ, ముధోల్: తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అన్నీ రంగాలలో అభివృద్ధి సాధించుకుంటున్నామని దేవాదాయ,అటవీ పర్యాటక శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బైంసా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ….పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలో ఆధునిక హంగులతో కోటి యాబై లక్షలతో ఒక ఎకరంలో వైకుంఠదామ నిర్మాణం, పలు కూడళ్లలో స్టాచ్యు నిర్మాణాలు నిర్మించడం జరిగిందన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి నెలా మున్సిపాలిటీకి అభివృద్ధి నిధులు బాగా ఉన్నాయన్నారు. అన్నీ రంగాల కార్యక్రమాలకు నిధులు అందిస్తున్నామని, పచ్చదనం,పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గడ్దెన్నా వాగు ప్రాజెక్టు ద్వారా వేల ఎకరాల సాగు భూమికి నీరు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్బంగా ప్రజలకి, కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస శ్రేణులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- indrakaran reddy






