విమాన శకలాల గుర్తింపు.. 62మంది జలసమాధి

49

దిశ,వెబ్‌డెస్క్ :ఇండొనేషియలో కుప్పకూలిన శ్రీ విజయ ఎయిర్ లైన్స్ చెందిన బోయింగ్ విమాన శకలాల్ని అధికారులు గుర్తించారు. బోయింగ్ విమానం జావా సముద్రంలో కుప్పకూలగా వాటి విమాన శకలాల్ని థౌజండ్ ఐలాండ్స్ వద్ద గుర్తించినట్లు తెలుస్తోంది. విమానంలో ఉన్న 62మంది ప్రయాణికులు జలసమాధి అయ్యిండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు.., బాధితుల కోసం జాతీయ రవాణా భద్రత కమిటీతో పాటు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజన్సీలు రంగంలోకి దిగాయని ఆ దేశ రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అదిత ఐరావతి తెలిపారు