- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిగో ఎయిర్ లైన్స్ వింత ఆఫర్..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : కరోనా కలవరం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. దీంతో విమానప్రయాణాలు చాలా మేరకు తగ్గిపోయాయి. కస్టమర్లు లేక విమానరంగం కూడా పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తోంది. అయితే, నష్టాల భారీ నుంచి తప్పించుకోవడానికి.. కస్టమర్లకు కరోనా భయం లేని ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇండిగో ఎయిర్ లైన్స్ వింత ఆఫర్ ప్రకటించింది. విమానంలో భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణించాలనుకునే ప్యాసింజర్స్‌కు కావాలంటే రెండు సీట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అందుకోసం 6E […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా కలవరం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. దీంతో విమానప్రయాణాలు చాలా మేరకు తగ్గిపోయాయి. కస్టమర్లు లేక విమానరంగం కూడా పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తోంది. అయితే, నష్టాల భారీ నుంచి తప్పించుకోవడానికి.. కస్టమర్లకు కరోనా భయం లేని ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇండిగో ఎయిర్ లైన్స్ వింత ఆఫర్ ప్రకటించింది.
విమానంలో భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణించాలనుకునే ప్యాసింజర్స్‌కు కావాలంటే రెండు సీట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించింది. అందుకోసం 6E డబుల్ సీట్ స్కీంను ఈనెల 24న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.అదనపు సీటు బుక్ చేసుకునే వారు వాస్తవ టికెట్ ధర కంటే 25శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో యాజమాన్యం స్పష్టంచేసింది. దీని ప్రకారం ప్రయాణికుడు బుక్ చేసుకున్న సీట్ పక్కనే రెండోది కూడా కేటాయిస్తామని తెలిపింది.
Next Story






