ఇండియా పొదుపు చేయడంలేదు!

by Harish |   (  Updated:2020-04-12 01:51:25  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇండియాలో పొదుపు రేటు 15 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. దేశీయ పొదుపు తగ్గడం వల్ల భారతీయ కంపెనీలు విదేశీ మార్కెట్ల నుంచి ఎక్కువ రుణాలను పొందేలా ఇది ప్రభావితం చేస్తుందని, దీనివల్ల ఇండియా బయట రుణాలను అధికమవుతాయని ఓ నివేదిక వెల్లడించింది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ యూబీఎస్ నివేదిక ప్రకారం&#8230; ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా స్థూల పొదుపు రేటు స్థూల జాతీయోత్పత్తిలో 30.1 శాతానికి పడిపోయింది. గతంలో 2003-04 [&hellip;]</p>

ఇండియా పొదుపు చేయడంలేదు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇండియాలో పొదుపు రేటు 15 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది. దేశీయ పొదుపు తగ్గడం వల్ల భారతీయ కంపెనీలు విదేశీ మార్కెట్ల నుంచి ఎక్కువ రుణాలను పొందేలా ఇది ప్రభావితం చేస్తుందని, దీనివల్ల ఇండియా బయట రుణాలను అధికమవుతాయని ఓ నివేదిక వెల్లడించింది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ యూబీఎస్ నివేదిక ప్రకారం… ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా స్థూల పొదుపు రేటు స్థూల జాతీయోత్పత్తిలో 30.1 శాతానికి పడిపోయింది. గతంలో 2003-04 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 29 శాతానికి దగ్గరగా ఉందని నివేదిక పేర్కొంది.

2019 ఆర్థిక సంవత్సరంలో స్థూల పొదుపులో 60 శాతం వాటాతో గృహవసారాల కోసం ఉంచే పొదుపు ఎక్కువగా ఉంది. ఈ పొదుపు కూడా 2016 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే తక్కువే అని నివేదిక తెలిపింది. తక్కువ పొదుపు ఉండటం ఇండియా లాంటి దేశం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మంచిది కాదు, ఎందుకంటే ఇది పెట్టుబడుల అవసరాల కోసం నిధులు సమకూర్చుకునేందుకు విదేశీ పొదుపుపై ఆధారపడేలా చేస్తుంది. ఇది మార్చేందుకు ఇండియాలో ఉద్యోగ కల్పనలను పెంచడం, ఆర్థిక వ్యవస్థలోని ఆదాయ స్థాయిలను పెంచడం వంటి వాటిపై దృష్టి సారించడానికి నిర్మాణ సంస్కరణ అవసరముంది అని నివేదిక వివరించింది.

ఈ అంశంపై కొంతమందిని ప్రశ్నించగా క్రితం ఏడాదితో పోలిస్తే ప్రస్తుతమున్న పొదుపు పెరిగిందని 70 శాతం మంది అభిప్రాయపడగా, ఇంకా ఎక్కువగా ఆదాయ చేయాల్సిన అవసరముందని 58 శాతం అభిప్రాయాలను తెలిపారు.

Tags : Gross Savings, Savings Rate, India, UBS

Next Story