భారీగా పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు!

by  |
FDI
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్య కాలంలో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా వచ్చి చేరాయి. సమీక్షించిన కాలంలో దేశంలోకి 27.37 బిలియన్ డాలర్ల(రూ. 2 లక్షల కోట్లకు పైగా) ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఇది గత సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే ఏకంగా 62 శాతం ఎక్కువ కావడం గమనార్హం. దేశీయంగా ఎఫ్‌డీఐ ఈక్విటీ ఇన్‌ఫ్లో 2020, ఏప్రిల్-జూలైలో 9.61 బిలియన్ డాలర్ల(రూ. 71 వేల కోట్ల)తో పోలిస్తే 112 శాతం పెరిగి 20.42 బిలియన్ డాలర్ల(రూ. 1.51 లక్షల కోట్ల)కు చేరుకున్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీలో 23 శాతం వాటాతో అత్యధికంగా విదేశీ పెట్టుబడులను సాధించిన రంగంగా నిలిచింది. దీని తర్వాత సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమ 18 శాతం, సేవల రంగం 10 శాతం ఎఫ్‌డీఐలను సాధించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆటో పరిశ్రమకు సంబంధించి సమీక్షించిన కాలంలో కర్ణాటక రాష్ట్రం అత్యధికంగా 87 శాతం ఎఫ్‌డీఐలను సాధించింది. ఎఫ్‌డీఐ పాలసీ, పెట్టుబడుల సదుపాయాలు, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా ఎఫ్‌డీఐ పెట్టుబడులు పెరిగేందుకు దోహదపడిన అంశాలని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.



Next Story

Most Viewed