మే 3వరకు ట్రైన్‌లు బంద్

by  |
మే 3వరకు ట్రైన్‌లు బంద్
X

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే భారత రైల్వే కూడా అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీ వరకు ట్రైన్ సేవలపై బంద్‌ను అలాగే కొనసాగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అన్ని రకాల మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ ట్రైన్స్, సబ్‌అర్బన్ ట్రైన్స్, మెట్రోలు మే 3వరకు విధులకు దూరంగా ఉంటాయని తెలిపింది. రద్దు అయిన ప్యాసింజర్ ట్రైన్‌లకు సంబంధించిన టికెట్ల సొమ్మును రిఫండ్ చేయనున్నట్టు వివరించింది. రైల్వే సేవల పునరుద్ధరణపై తగిన సమయంలో ప్రకటిస్తామని, అప్పటి వరకు బంద్ కొనసాగుతుందని తెలిపింది. గతనెల మోడీ ప్రకటించిన 21రోజుల లాక్‌డౌన్ ఇవ్వాళ్టితో ముగియనున్న నేపథ్యంలో దాన్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్నిఈ రోజు ఉదయం ప్రధాని వెల్లడించారు.

Tags: indian railways, shutdown, continuation, announcement, may 3rd, lockdown


Next Story

Most Viewed