కుటుంబ పాలనను తరిమి కొట్టండి... మోదీని గెలిపియండి : జేపీ నడ్డా

by Disha Web Desk 11 |
కుటుంబ పాలనను తరిమి కొట్టండి... మోదీని గెలిపియండి : జేపీ నడ్డా
X

దిశ, ప్రతినిధి,కొత్తగూడెం: కుటుంబ పాలనను తరిమి కొట్టండి కమలం పువ్వుకు ఓటు వేసి మోదీని గెలిపించండి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ జనసభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖమ్మం బిజెపి పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద రావును ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండుటెండని లెక్కచేయకుండా వేలాదిగా ప్రజలు తరలి వచ్చిన తీరును చూస్తుంటే తమ బిజెపి అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి, దేశం బాగుండాలన్నా,అభివృద్ధి చెందాలన్న కేవలం బీజేపీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుందని అన్నారు. దేశంలో శక్తివంతమైన నాయకుడు మోదీ అని, ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వచ్చి బిజెపి అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి చరిత్ర తిరగ రాసిన నాయకుడిని ప్రజలు కల్లారా చూశారని అన్నారు. ఒక శక్తివంతమైన ప్రభుత్వం రావాలంటే కాంగ్రెస్ పార్టీ లాంటి కుటుంబ వారసత్వ పార్టీలను కాకుండా బలమైన బిజెపి లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. ముఖ్యంగా గిరిజనుల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం అని అన్నారు.

ఆర్థికంగా భారత దేశం బలపడుతుందని భారతదేశాన్ని 11వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మోడీకే చెందుతుందని అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం గత 10 సంవత్సరాల నుండి పాటు పడుతుంది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో భారత దేశం ముందుకెళుతోందని అన్నారు. ఆటో మొబైల్ రంగాల్లో జపాన్ ముందు వరుసలో ఉండేది కానీ అందులో కూడా మేక్ ఇన్ ఇండియా పేరు మీద ముందు వరుసలో ఉన్నాం అన్నారు. దేశంలో అనేక మార్పులు వస్తున్నాయి, గత పది సంవత్సరాల్లో మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, గ్రామాలలో అనేక పథకాలను అందించిన ప్రభుత్వం మాది మాత్రమే అన్నారు.

రాబోయే 5 సంవత్సరాల్లో 7 కోట్ల కుటుంబాలకు గ్యాస్ అందించే పథకాన్ని బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం నుంచి 3వంతుల ఆర్థిక సహాయం అందిందని ,రైల్వే స్టేషన్ల సుందరీకరణ తో పాటు కొత్త రైల్వే లైన్ల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని అన్నారు. అంతేగాక గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.

గత 10 సంవత్సరాల కాలంలో బిపిఎల్ నుండి ఏపీఎల్లోకి 25 కోట్ల మంది చేరుకున్నారని దానికి కారణం నిస్వార్ధపు ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ అని అన్నారు. బిజెపి పార్టీ తరఫున పోటీ చేస్తున్న తమ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కొత్తగూడెం బహిరంగ సభలో రాజ్యసభ సభ్యులు ఓ బి సి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ధర్మారావు, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కె.వి.రంగా కిరణ్, భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story