‘జూన్ 13 కల్లా లక్ష మంది భారతీయులను వెనక్కి తెస్తాం’

by  |
‘జూన్ 13 కల్లా లక్ష మంది భారతీయులను వెనక్కి తెస్తాం’
X

న్యూఢిల్లీ: వందే భారత్ మిషన్ రెండో దశలో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న ఒక లక్ష మంది భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నట్టు కేంద్ర విదేశాంగ వ్యవహారా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మే 16న మొదలైన ఈ రెండో దశ వందే భారత్ మిషన్ జూన్ 13తో ముగియనున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా దేశాల్లోని భారతీయుల కోసం గతవారం అదనంగా 141 విమానాలను కేంద్రం వినియోగంలోకి తీసుకొచ్చింది. కాగా, ఇరాన్, శ్రీలంక, మాల్దీవుల్లో నుంచీ భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు నేవీ నాలుగు ట్రిప్పులను వేయనుంది. కనీసం 5,000 మంది భూ సరిహద్దు గుండా నేపాల్, బంగ్లాదేశ్‌ల నుంచి దేశంలోకి ప్రవేశించారు. విదేశాల్లోని సుమారు 3,08,200 మంది భారత్‌కు తిరిగి వచ్చేందుకు రిజిస్టర్ చేసుకున్నట్టు సమాచారం.

Next Story