అక్షర్ విజృంభణ.. మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు

by  |
Akshar patel
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని మోతేరా వేదికగా జరుగుతున్న పింక్ బాల్‌ టెస్టులో టీమిండియా ఆటగాళ్లు తడబడ్డారు. బౌలింగ్‌లో అదరగొట్టినా.. బ్యాటింగ్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఓపెనర్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ మినహా మిగతా బ్యాట్‌మెన్‌లందరూ స్వల్ప స్కోరుకే పెవీలియన్ చేరారు. ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌, కెప్టెన్‌ జో రూట్‌ స్పిన్‌ దెబ్బకు వరసగా పడేశారు. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 53.2 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియాకు 33 పరుగుల ఆధిక్యం లభించింది.

అనంతరం.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను అక్షర్ పటేల్ ఆరంభంలోనే చుక్కలు చూపించాడు. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి, ఇంగ్లాండ్‌‌ను మళ్లీ కష్టాల్లోకి నెట్టాడు. అక్షర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతికి ఓపెనర్‌ జాక్‌ క్రాలే(0) బౌల్డ్ అయ్యాడు. తదుపరి వెంటనే రెండో బంతికి వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో(0) డకౌట్ అయ్యాడు. అనుమానం వచ్చి రివ్యూకు వెళ్లడంతో నాటౌట్‌గా తేలింది. ఆ తర్వాతి మూడో బంతికే బెయిర్‌స్టో మళ్లీ బౌల్డవ్వడంతో ఇంగ్లాండ్ పరుగుల ఖాతా తెరవకముందే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సిబ్లీ, రూట్‌ ఉన్నారు. మరి వీరు రాణిస్తారో.. భారత బౌలర్లకు వికెట్లు సమర్పించుకుంచుకుంటారో చూడాలి.


Next Story

Most Viewed