- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనాలో ‘ఇండిపెండెన్స్ డే’ వేడుకలు..
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: చైనాలోని భారత రాయబార కార్యాలయంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ దేశంలోని భారత దౌత్యవేత్త విక్రం మిస్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మన దేశం ప్రస్తుతం రెండు సమస్యలతో పోరాడుతోంది. ఒక పక్క ప్రజలు కరోనాతో పోరాడుతుంటే.. మరో పక్క సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులపై దేశం అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. ఈ రెండు సమస్యలూ దేశాన్ని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: చైనాలోని భారత రాయబార కార్యాలయంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ దేశంలోని భారత దౌత్యవేత్త విక్రం మిస్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘మన దేశం ప్రస్తుతం రెండు సమస్యలతో పోరాడుతోంది. ఒక పక్క ప్రజలు కరోనాతో పోరాడుతుంటే.. మరో పక్క సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులపై దేశం అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది.
ఈ రెండు సమస్యలూ దేశాన్ని కలవరపెడుతున్నాయి. దేశ స్వాతంత్ర్యం కోసం 74 ఏళ్ల కిందట ఎలాంటి పోరాటం చేశామో.. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే మన దేశం ఎదుర్కొంటోందని’ విక్రం పేర్కొన్నారు. అనంతరం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Next Story






