ఓటు వేసిన అసదుద్దీన్.. ఏం చెప్పాడంటే?

3109

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో గ్రేటర్ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సందర్భంగా శాస్త్రీపురంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… హైదరాబాద్ ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచాలన్నారు. అంతేగాకుండా ముషీరాబాద్‌ డివిజన్‌లో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తన ఓటు హక్కను వినియోగించుకున్నారు.

అయితే పాతబస్తీలోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పాతబస్తీలో మొత్తం 590 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 387 ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు. 70 వేల సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.