ఆకట్టుకున్న చిన్నారుల బతుకమ్మ సంబురాలు

by  |
bathukamma-1
X

దిశ, నూతనకల్: మండలంలోని చిల్పకుంట్ల గ్రామంలో ఉన్న అంగన్ వాడీ-2 కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ బత్తుల రేణుక మాట్లాడుతూ.. ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సంబురాలు నిర్వహిస్తామని, ఈ సంబురాల్లో పిల్లలు కూడా పాల్గొంటారని ఆమె తెలిపారు. తీరొక్క పూలతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో తయారు చేసిన బతుకమ్మ చూపరులను ఆకట్టుకున్నాయి. ఆయమ్మ బత్తుల వెంకటమ్మ, నాగమణి, చిన్నారుల తల్లిదండ్రులతోపాటు తదితరులు పాల్గొని బతుకమ్మ ఆడారు.

Next Story

Most Viewed