కలుషిత ఆహారం తిని 41 మంది అస్వస్థత

78

దిశ, ఉట్నూర్ : నార్నూర్ మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో విందు భోజనం కార్యక్రమంలో కలుషిత ఆహారం వికటించి 41మంది అస్వస్థతకి గురయ్యారు. అస్వస్థతకు గురైన వారికి ప్రస్తుతం నార్నూర్ ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. నలుగురి పరిస్థితి అందోళనకరంగా ఉండటంతో ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. ఏజెన్సీ జిల్లా అదనపు వైద్యాధికారి కుడిమెత మనోహర్ పర్యవేక్షిoచి వైద్యం అందించారు. ఎవరికి ఏ హాని కలగలేదని వైద్యులు వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..