కొత్త పద్ధతిలో కప్పల డేటింగ్.. పోటీకి రాకుండా ఇతర కప్పలకు అలా వార్నింగ్

by  |
కొత్త పద్ధతిలో కప్పల డేటింగ్.. పోటీకి రాకుండా ఇతర కప్పలకు అలా వార్నింగ్
X

దిశ, ఫీచర్స్ : జలపాతాల దగ్గర సంచరించే ‘బోర్నియన్ రాక్’ జాతికి చెందిన మగ కప్పలు పాదాల సిగ్నల్స్‌తో ఇతర కప్పలతో కమ్యూనికేట్ అవుతుంటాయి. తమ కాలును గాలిలోకి తన్నడం(ఫుట్-ఫ్లాగింగ్), పాదాన్ని పూర్తిగా విస్తరించి, తిరిగి నేలవైపుగా లాగడం వంటి సంజ్ఞలతో తమ సమూహంలోని ఇతర మగ కప్పలను భయపెడతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ‘ఫుట్-ఫ్లాగింగ్’ను చూస్తే మనకు బెదిరింపుగా అనిపించదు కానీ ఆ దృశ్యం ఇతర కప్పల అవగాహనతో సంబంధాన్ని కలిగి ఉంటుంది.

ఏదైనా ఒక సన్నని వస్తువు, తన పొడవాటి అక్షానికి సమాంతరంగా కదులుతుంటే (ఒక పురుగు భూమిపై ప్రయాణించినట్లు) కప్ప దాన్ని ఆహారంగా భావిస్తుంది. లంబంగా కదులుతున్న సారూప్య ఆకృతిని చూస్తే(పురుగులా కాకుండా) మాత్రం దాన్ని ముప్పుగా భావిస్తుంది. ‘యాంటీ-వార్మ్ స్టిమ్యులస్’గా పిలువబడే ఈ గెశ్చర్.. కప్పల హృదయాల్లో భయాన్ని కలిగిస్తుంది. పురుగులను వేటాడేందుకు, పెద్ద జీవుల నుంచి రక్షించుకునేందుకు కప్పలు ఈ విజువల్ సిస్టమ్‌ను ఫాలో అవుతాయి. కాగా కొన్ని మగ కప్పలు మాత్రం ఈ ‘యాంటీ-వార్మ్ సిగ్నల్’‌ (కాలును గాల్లోకి తన్నడం, వెనక్కి తీసుకోవడం)ద్వారా.. సాటి మగ కప్పల్లో కలిగే భయాన్ని సద్వినియోగం చేసుకుని ఫిమేల్ ఫ్రాగ్‌తో మేటింగ్‌ చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు.

మేటింగ్‌లో పోటీకి రాకుండా..

‘బోర్నియన్ రాక్’ జాతి మగ కప్పల కాలి వేళ్ల మధ్య తెల్లటి వెబ్‌బింగ్‌ ఉంటుంది. దీని వల్ల నల్లటి రాళ్ల మధ్య కూడా వాటి పాదాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కాగా ఇవి గాల్లోకి కాలు ఎత్తినప్పుడు ప్రవాహంలో తిరుగుతున్న ఆడ కప్ప అట్రాక్ట్ అవుతుందని.. మిగతా మగ కప్పలు పోటీకి రాకుండా అదొక హెచ్చరిక వలె ఉంటుందని వియన్నా జూ రీసెర్చర్ డోరిస్ ప్రినింగర్ అన్నారు. అయితే ఆడ కప్ప కూడా మొదటిసారి చూసిన మగ కప్పతోనే జతకడుతుందని తెలిపారు. కొద్ది మోతాదులో టెస్టోస్టిరాన్‌ను ఇవ్వడం ద్వారా బోర్నియన్ రాక్ కప్పల ‘ఫుట్-ఫ్లాగింగ్’ బిహేవియర్‌ను పెంచవచ్చని వివరించారు. కప్పకు ఇచ్చిన హార్మోన్స్.. దాని కాలు కండరాలపై పనిచేయడంతో అవి కాళ్లతో చేసే సిగ్నల్స్‌ స్థాయి అసాధారణంగా పెరుగుతుందన్నారు. అంటే కప్ప పాదాల్లో టెస్టోస్టిరాన్ ఎంత ఎక్కువ స్థాయిలో ప్రవహిస్తే ప్రతిచర్య అంత ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed