- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lockdown : లాక్‌డౌన్లో బయటకు వస్తే పువ్వు మీకు.. బైక్ మాకు…
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా సేకండ్ వేవ్ రూపంలో వ్యాప్తి చెందుతుంటే, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. అయితే లాక్‌డౌన్ లో కూడా ప్రజల కోసం సడలింపును ఇస్తే అదే అదునుగా భావించిన కొందరకు సడలింసు సమయం దాటిన తరువాత కూడా రోడ్లపైకి వచ్చి పోలీసులకు పట్టబడుతున్నారు. పోలీసులు ఆపడంతో మెడికల్, గ్యాస్, కరోనా టెస్టు అంటూ పోలీసులతో వాగ్వదానికి దిగుతున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ధృవీకరణ ప్రతాలు, ఈ పాస్‌లు ఉన్న వారిని పోలీసులు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సేకండ్ వేవ్ రూపంలో వ్యాప్తి చెందుతుంటే, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. అయితే లాక్‌డౌన్ లో కూడా ప్రజల కోసం సడలింపును ఇస్తే అదే అదునుగా భావించిన కొందరకు సడలింసు సమయం దాటిన తరువాత కూడా రోడ్లపైకి వచ్చి పోలీసులకు పట్టబడుతున్నారు. పోలీసులు ఆపడంతో మెడికల్, గ్యాస్, కరోనా టెస్టు అంటూ పోలీసులతో వాగ్వదానికి దిగుతున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. ధృవీకరణ ప్రతాలు, ఈ పాస్‌లు ఉన్న వారిని పోలీసులు వదిలిపెడుతున్నారు.
కానీ కొంత మంది ఆకతాయిలు పోలీసులకు దొరికి వాహనాన్ని సీజ్ చేయించుకుంటున్నారు. కర్ణాటకలో లాక్‌డౌన్ (Lock Down in Karnataka )విధంచిన విషయం తెలిసిందే. అక్కడకూడా సడలింపు సమయం తరువాత రోడ్లపైకి వస్తున్న వారికి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. అయితే బెంగళూరు పీణ్యా పోలీసులు మాత్రం వినూత్నంగా వాహనం ఆపి సరైన కారణం లేకపోవడంతో వారిచేతిలో పువ్వుపెట్టి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులు ఇలా చేయడంతో వాహనచోదకులు అవాక్కావుతున్నారు.






