- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొలేరో వాహనంపై మావోయిస్టుల దాడి.. ఇద్దరికి తీవ్రగాయాలు
<p>దిశ, భద్రాచలం : దంతెవాడలో మావోయిస్టులు ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పౌరులను భద్రతా బలగాలు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దంతెవాడ ఎస్పి అభిషేక పల్లవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు బొలేరో వాహనంలో నారాయణపూర్ నుంచి దంతెవాడకు వెళుతుండగా, గురువారం ఉదయం 7.35 సమయంలో మలేవాహి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘోటియా వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో బొలేరోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. మావోయిస్టులు […]</p>

X
దిశ, భద్రాచలం : దంతెవాడలో మావోయిస్టులు ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పౌరులను భద్రతా బలగాలు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దంతెవాడ ఎస్పి అభిషేక పల్లవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు బొలేరో వాహనంలో నారాయణపూర్ నుంచి దంతెవాడకు వెళుతుండగా, గురువారం ఉదయం 7.35 సమయంలో మలేవాహి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఘోటియా వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో బొలేరోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. మావోయిస్టులు పౌరుల వాహనం పేల్చడానికి కారణం కనుగొనే పనిలో పోలీసులు నిమగ్నమైనారు.
Next Story






