బంగారం డిమాండ్ 35 శాతం తగ్గుతుంది : ఇక్రా!

by  |
బంగారం డిమాండ్ 35 శాతం తగ్గుతుంది : ఇక్రా!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారితో పాటు అధిక ధరల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాల డిమాండ్ 35 శాతం కుదించుకుపోవచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. మొదటి రెండు త్రైమాసికాల్లో పేలవమైన పనితీరు తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో డిమాండ్ తిరిగి పుంజుకునే అవకాశముందని ఇక్రా అభిప్రాయపడింది. వినియోగదారుల అలవాట్లలో మార్పుల కారణంగా పరిశ్రమ వేగాన్ని తగించాయి. బంగారు ఆభరణాల రిటైల్ పరిశ్రమపై ప్రతికూల దృక్పథాన్ని తాము కొనసాగిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరానికి 35శాతం సంకోచాన్ని పరిగణలోకి తీసుకుంటామని’ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ కె శ్రీకుమార్ చెప్పారు.

ఏప్రిల్, మే నెలల్లో సరఫరా వ్యవస్థలో అంతరయం, అనవసరం వస్తువుల సరఫరాకు ఆంక్షలు ఉండటంతో మొదటి త్రైమాసికంలో బంగారు ఆభరణాల డిమాండ్ 74 శాతం పడిపోయింది. అక్షయ తృతీయ సందర్భంలోనూ అమ్మకాలు క్షీణించాయి. ప్రధానంగా బంగారం ధరలు పెరుగుదల వినియోగదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండో త్రైమాసికంలోనూ డిమాండ్ బలహీనంగా ఉంది. బంగారం ధరల పెరుగుదల, దేశంలోని పలు ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో బంగారు ఆభరణాల డిమాండ్ 48శాతం క్షిణించింది. మూడు, నాలుగు త్రైమాసికాల్లో డిమాండ్ పుంజుకుంటుందని చిల్ల వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed