- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా పేషెంట్లకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ తప్పనిసరి కాదు : ఐసీఎంఆర్
<p>న్యూఢిల్లీ : కరోనా పేషెంట్లకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ తప్పనిసరిగా వినియోగించాలని రికమండ్ చేయట్లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తెలిపింది. ఈ మందు నిజంగానే కొవిడ్-19 పేషెంట్లపై ప్రభావితంగా పనిచేస్తున్నదా? లేదా? అనేది నిర్ధారణ అయ్యే వరకు ఈ మందును తీసుకోవచ్చని చెప్పబోమని వెల్లడించింది. ఐసీఎంఆర్ డాక్టర్ కేకే గంగఖేద్కర్ మాట్లాడుతూ.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ తప్పనిసరి కాదన్న విషయమాన్ని మనమందరం ముందు గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ మందు నిజంగానే ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుందా? లేదా? అనేది టెస్టుల […]</p>

న్యూఢిల్లీ : కరోనా పేషెంట్లకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ తప్పనిసరిగా వినియోగించాలని రికమండ్ చేయట్లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) తెలిపింది. ఈ మందు నిజంగానే కొవిడ్-19 పేషెంట్లపై ప్రభావితంగా పనిచేస్తున్నదా? లేదా? అనేది నిర్ధారణ అయ్యే వరకు ఈ మందును తీసుకోవచ్చని చెప్పబోమని వెల్లడించింది. ఐసీఎంఆర్ డాక్టర్ కేకే గంగఖేద్కర్ మాట్లాడుతూ.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ తప్పనిసరి కాదన్న విషయమాన్ని మనమందరం ముందు గుర్తుంచుకోవాలని చెప్పారు. ఈ మందు నిజంగానే ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుందా? లేదా? అనేది టెస్టుల తర్వాతే తెలుస్తుందని వివరించారు. లక్షణాలు కనిపించిన కరోనా పేషెంట్లపై వైద్యులు ఈ మందుతో ఇప్పటికీ పరీక్షలు జరుపుతూనే ఉన్నారని పేర్కొన్నారు. సంతృప్తికర ఫలితాలు వెలువడేవరకు ఈ మందును ఎవరికీ రికమండ్ చేయబోమని తెలిపారు. ఐసీఎంఆర్ ప్రకారం.. కొవిడ్ 19 పేషెంట్లు లేదా అనుమానితులతో సన్నిహితంగా మెలిగిన వైరస్ లక్షణాలు కనిపించని వైద్య సిబ్బందికి ఈ మందును వినియోగిస్తున్నారు.
Tags: hydroxy chloroquine, ICMR, recommend, testing, not mandatory






