కోహ్లీకి షాక్… దారుణంగా పడిపోయిన ర్యాంక్

151

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ విరాట్ కోహ్లీకి ICC ర్యాంకుల్లో పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. బ్యాటర్ల ర్యాంకుల్లో 18 నెలల తర్వాత టాప్ 10 నుంచి కిందకు దిగిపోయాడు. కోహ్లీ ఏకంగా 8వ ర్యాంకు నుంచి 11వ ర్యాంకుకు పడిపోయాడు. న్యూజీలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరమవడంతో అతడి ర్యాంకు పడిపోయింది. ఇక టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ 2 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతడి ర్యాంక్ 13గా ఉన్నది. అయితే టాప్ 10 ర్యాంకుల్లో ఒకే ఒక్క భారత బ్యాటర్‌కు స్థానం దక్కింది. న్యూజీలాండ్ సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలో కూడా రాణించిన కేఎల్ రాహుల్ ఒక స్థానం మెరుగుపరుచుకొని 5వ ర్యాంకుకు చేరుకున్నాడు. అతడు తప్ప టాప్ 10లో మరో భారత బ్యాటర్‌కు స్థానం దక్కలేదు. ప్రస్తు్తం పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

ఆ ఇద్దరినే రిటైన్ చేసుకుంటున్న SRH టీమ్

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..