క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు వాయిదా

by  |
క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు వాయిదా
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా రెండు క్వాలిఫైయింగ్ టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ప్రకటించింది. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ లీగ్ సెప్టెంబర్‌లో నమీబియాలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో నమీబియా, పాపువా న్యూగినియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్లు పోటీ పడనున్నాయి. ఆగస్టులో అండర్ -19 వరల్డ్ కప్ రీజినల్ క్వాలిఫైయిర్ డివిజన్ పోటీలు టాంజానియాలో జరగాల్సి ఉంది. ఆగస్టు 7 నుంచి 14 వరకు జరగాల్సిన ఈ పోటీల్లో బోట్సువానా, కెన్యా, మొజాంబిక్, రువాండా, సియెర్రా లియోనీ, టాంజానియా జట్లు పాల్గొనాల్సి ఉంది. ఈ రెండు ఈవెంట్లను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ ప్రకటించారు. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్‌ను వాయిదా వేయడమే కాకుండా, 2023 ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ను మార్చి నుంచి నవంబర్‌కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed