భారత్‌లో మరిన్ని సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు: ఐబీఎం ఛైర్మన్!

by  |
business
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా టెక్ దిగ్గజం ఐబీఎం భారత వృద్ధిపై పూర్తిస్థాయిలో సానుకూలంగా ఉందని, దేశ డిజిటలైజేషన్‌లో భాగస్వామిగా ఉండేందుకు సిద్ధంగా ఉందని కంపెనీ సీఈఓ, ఛైర్మన్ అరవింద్ కృష్ణ అన్నారు. దీనికోసం భారత్‌లో మరిన్ని సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కేంద్రాలను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భారత పర్యటనలో భాగంగా ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, టెలికాం, ఐటీ శాఖ మంత్రులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశీయ నైపుణ్యం, శ్రామికశక్తి అభివృద్ధితో సహా పలు అంశాల గురించి ఆయన చర్చించారు. భారత్‌లో ఐబీఎం వ్యాపారం ఆశావాహంగా కొనసాగుతోంది.

ఆర్థిక, సేవలు, టెలికాం, ప్రభుత్వ రంగ పారిశ్రామికం సహా అనేక రంగాల్లో మెరుగైన అనుబంధం ఉంది. రానున్న రోజుల్లో మరింత పురోగతి ఉంటుందనే నమ్మకం ఉందని’ అరవింద్ కృష్ణ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో లేని విధంగా భారత్ దూసుకుపోతోందన్నారు. గత ఆరు నెలల్లో భారత్‌లోని టైర్2 నగరాల్లో ఐబీఎం సంస్థ విస్తరించింది. నియామకాలను సైతం అంతే స్థాయిలో వేగవంతం చేసింది. ప్రస్తుతం భారత్‌లోని బెంగళూరు, హైదరాబాద్, పూణెలలో పెద్ద సెంటర్లు ఉన్నాయి. అలాగే, ఢిల్లీలో ఆర్అండ్‌డీ కేంద్రం ఉందని కృష్ణ తెలిపారు.

Next Story