6 నెలల మారటోరియం ప్రతిపాదన!

by  |
RBI
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాప్తి పెరుగుతూనే ఉంది. కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్‌బీఐ వినియోగదారులకు 3 నెలల ఈఎమ్ఏఇ మారటోరియం వెసులుబాటు ఇచ్చింది. అయితే, కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉండటం, లాక్‌డౌన్ పాక్షికంగా మాత్రమే కొనసాగనుండటం వంటి పరిణామాలతో ఈఎమ్ఐ మారటోరియంను ఇంకొంత కాలం పొడిగించాలనే చర్చ మొదలైంది. తాజాగా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) కేంద్ర ప్రభుత్వానికీ, రిజర్వ్ బ్యాంకుకు కొన్ని కీలకమైన సూచనలు అందించింది.

లాక్‌డౌన్ వల్ల అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం ఉందని, సంస్థలపై ఆర్థిక భారం అధికమవుతున్న నేపథ్యంలో వారి ఒత్తిడి తగ్గించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. చిన్న, మధ్య తరహా సంస్థల లోన్లకు క్రెడిట్ గ్యారెంటీ, కొవిడ్-19 వల్ల నష్టాలను ఎదుర్కొన్న రంగాలకు వన్ టైమ్ లోక్ రీ-స్ట్రక్చరింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు ఉపశమనం కల్పించాలని, అలాగే..మారటోరియం పెంపు సదుపాయాలను అందించాలని ప్రతిపాదించింది. సాధారణంగా ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం..లోక్ రీ-స్ట్రక్చరింగ్ నిషేధం. అంతేకాకుండా డీఫాల్ట్ అయినా రుణాలను దివాళా చట్టం ప్రకారమే పరిష్కరించాల్సి ఉంటుంది. పలు రంగాలకు చెందిన పరిశ్రమల వర్గాలు ఇచ్చిన సూచనల ప్రకారం ఐబీఏ కేంద్రానికి, ఆర్‌బీఐకి పలు రంగాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేసింది.

Tags : Bankers, Coronavirus, Coronavirus Outbreak, IBA, Industry Association, Lockdown, Moratorium, MSME, NBFC Sector, RBI



Next Story

Most Viewed