రోడ్డుపై కారు పార్కింగ్.. కళ్ల ముందే కారును మింగేసిన గుంత.. వీడియో వైరల్

by  |
Mumbai Car
X

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు వరదలతో నిండిపోయాయి. ఈ క్రమంలోనే దారుణ ఘటన చోటుచేసుకుంది. ముంబైలో వర్షాలకు బావిపై నిర్మించిన స్లాబ్‌ కూలిపోయి అక్కడ పార్క్ చేసిన కారు మునిగిపోయింది. వివరాల ప్రకారం.. నగరంలోని రామ్‌నివాస్​సొసైటీలో దారికి అడ్డంగా ఉందని ఓ పాడు బడ్డ బావిని థార్, కాంక్రీట్‌తో నింపేశారు.

అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బావిపై థార్‌, కాంక్రీట్‌ కొట్టుకుపోయింది. అది గమనించకుండా బావిపై స్థానికులు వాహనం అక్కడ పార్క్ చేశారు. ఈ నేపథ్యంలో కారు బరువుకు బావి పైకప్పు కుంగిపోయి వాహనం అందులోని నీటిలో మునిగిపోయింది. ఓ వ్యక్తి తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story

Most Viewed