హైపర్ ఆది కనిపిస్తే ఖతమే! వెతుకుతున్న స్టార్ హీరో ఫ్యాన్స్

by  |
హైపర్ ఆది కనిపిస్తే ఖతమే! వెతుకుతున్న స్టార్ హీరో ఫ్యాన్స్
X

దిశ, సినిమా : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చాలాసార్లు కాంట్రవర్సీలకు దారితీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హైపర్ ఆది తన స్కిట్‌లో కామెడీ పంచ్‌లను ఓ రేంజ్‌లో పేలుస్తుంటాడు. ఇందులో కొన్ని సరదాగా ఉన్నా.. మరికొన్ని మాత్రం కొందరి మనోభావాలను దెబ్బతీస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరైన ఆది.. ఒక స్టార్ హీరోను వెటకారంగా ఇమిటేట్ చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ హీరో అభిమానులు.. హైపర్ ఆది కనపడితే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. అంతేకాదు ‘ఒకసారి బయట కనపడి చూడు బిడ్డా.. మా స్టార్ హీరో ఫాన్స్ అంటే ఏమిటో నీకు చూపిస్తాం’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.

అయితే ఈ విషయం తెలిసిన ఆది.. అప్పటి నుంచి ఇటు షూటింగ్‌కు హాజరు కాలేక, అటు ఇంట్లోనూ ఉండలేక సతమతమవుతున్నాడని సమాచారం. అంతేకాదు సొంత వాహనంలోనూ వెళ్ళలేక ఎక్కడో దాక్కున్నాడంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మా స్టార్ హీరోపై మరోసారి ఇలాంటి పంచ్‌లు వేస్తే ఊరుకునేది లేదంటూ ఫ్యాన్స్ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు.

Next Story