హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో ప్రమాదం..

129

దిశ, వెబ్‌‌డెస్క్: కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలంతా కృషి చేస్తున్నారు. అప్పటిదాకా వైరస్‌ వ్రాప్తిని కట్టడి చేయడంలో భాగంగా ఇప్పటికే భారత్ సహా మరికొన్ని దేశాలు కరోనా బాధితులకు ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ మందును ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మందు వాడకూడదంటూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్‌వో) ఓ సంచలన ప్రకటన చేసింది. హైడాక్సి క్లోరోక్విన్, అజిత్రో మైసిన్‌లు కలిపి వాడితే.. చాలా ప్రమాదమని వాండర్ బిల్ట్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడిస్తుండటం గమనార్హం.

కరోనా వైరస్ సోకిన రోగులకు హైడ్రాక్సి క్లోరోక్విన్ మెడిసిన్ ఇచ్చిన తర్వాతే ఎక్కువగా మరణిస్తున్నారని ఇటీవలే లాన్సెట్‌లో ఓ అధ్యయనం వెలువడింది. ఈ క్రమంలోనే డబ్లూహెచ్‌వో ఆ మందు ఇవ్వడం ఆపాలంటూ ఇటీవలే ప్రకటన చేసింది. కరోనా చికిత్సలో భాగంగా హైడ్రాక్సి క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ మందులను విడిగా కానీ, కలిపి కానీ వాడుతుండటం పట్ల వాండర్ బిల్ట్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు డబ్లూహెచ్‌వో డేటా బేస్‌లో ఉన్న 21 మిలియన్ల కేసు రిపోర్టులపై పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధన ప్రకారం ఆ మందుల వాడకం గుండె కొట్టుకునే క్రమపద్ధతిని (ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్స్) దెబ్బతీస్తుందని తెలిసింది. ఈ రెండింటిని కలిపి ఎక్కువ రోజులు వాడితే.. హార్ట్ ఫెయిల్ అవుతుందని పరిశోధకులు వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..